వైభవ్ సూర్యవంశీ ఓ అరుదైన ప్రతిభ.. అతడు భవిష్యత్ స్టార్: శ్రేయస్ అయ్యర్

  • రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై శ్రేయస్ ప్రశంసలు
  • వైభవ్ భవిష్యత్ తరం ఆటగాడని, అరుదైన ప్రతిభ అని కితాబు
  • భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే లక్ష్యంపై స్పష్టత ఉంటుందని వ్యాఖ్య
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన ప్రతిభ అని, భవిష్యత్ తరం ఆటగాడని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడి విధ్వంసకర బ్యాటింగ్ నైపుణ్యాలను వర్ణించడానికి ఏ విశేషణాలు సరిపోవని అన్నాడు. ఈ సీజన్‌లో వైభవ్ కేవలం ఆరు ఇన్నింగ్స్‌లలోనే 41 సగటు, 236.53 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

జియోస్టార్ నిర్వహించిన 'బిలీవ్' కార్యక్రమంలో అయ్యర్ మాట్లాడుతూ... "వైభవ్ ఒక అద్భుతమైన ప్రతిభావంతుడు. అతడిని ఎంత పొగిడినా తక్కువే. అతడి బ్యాట్ ఫ్లో, బంతి పడకముందే అతను సృష్టించుకునే రిథమ్, మొమెంటం అద్భుతం. అతను కచ్చితంగా భవిష్యత్ స్టార్" అని వివరించాడు.

ఇదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కూడా ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 52 సగటుతో, 182.45 స్ట్రైక్ రేట్‌తో 208 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ రన్నరప్‌గా నిలవగా, క్వాలిఫయర్ 2లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తాను ఆడిన ఇన్‌స్టింక్టివ్ షాట్‌ను కూడా అయ్యర్ గుర్తుచేసుకున్నాడు.

"అది పూర్తిగా సహజసిద్ధంగా వచ్చిన షాట్. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ను ఎదుర్కొనేటప్పుడు మీ నైపుణ్యాన్ని నమ్మాలి. ఆ షాట్ తర్వాత నేను సంబరాలు చేసుకోలేదు. ఎందుకంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటేనే, మీ ప్రధాన లక్ష్యంపై స్పష్టతతో నిర్ణయాలు తీసుకోగలరు" అని అయ్యర్ తన మానసిక దృక్పథాన్ని వివరించాడు.

Shreyas Iyer
Vaibhav Suryavanshi
Rajasthan Royals
Punjab Kings
IPL 2025
Indian Premier League
Jasprit Bumrah
Cricket
Cricket Player
Batting

More Telugu News